నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువలోకి భారీ క్రేన్ దూసుకెళ్లింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆనకట్ట పై నుంచి క్రిందకు దిగుతుండగా భారీ క్రేన్ అదుపు తప్పి దిగువన ఉన్న ప్రధాన కాకతీయ హెడ్ రెగ్యులేటర్ కాలువలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. క్రేన్ ఆపరేటర్ ముందుగానే బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
