HomeCRIMEయువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ...

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ అధికారి మల్లరెడ్డి అన్నారు.

నిజామాబాద్ జిల్లా (ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ వి. సోమిరెడ్డి ఆదేశాలననుసరించి మరియు నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి K . మల్ల రెడ్డి సూచనల మేరకు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా యువత డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్ళవద్దని,

అదేవిధంగా అనుమతి లేని ప్రదేశాలలో కానీ, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగినా ,అనుమతులు లేకుండా హోటల్ లో గాని , దాబాల్లో గాని మద్యంతో కూడిన వేడుకలు నిర్వహించిన కఠినచర్యలు తీసుకో బడతాయని చెప్పినారు.

ఫంక్షన్ హాల్స్, హోటల్స్ యందు మద్యం వినియోగించుటకు ఈవెంట్ పర్మిషన్ జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుంచి కచ్చితంగా తీసుకోవాలని, ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి తెలిపారు.

ఇతర రాష్ట్రాల మద్యంను విక్రయించిన లేదా కలిగి యున్న చట్ట పరమైన చర్యలు తీసుకోనబడతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

నూతన సంవత్సరం సందర్భంగా నిజామాబాద్ జిల్లా లో (07) ప్రత్యేక ఎక్సైజ్ టిమ్స్ ఏర్పాటు చేయబడ్డాయని,జిల్లా సరిహద్దు లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పై కేసుల్లో పట్టు బడితే తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనబడతాయని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments