తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పోరేట్ విద్య, వైద్య సంస్థల దోపిడిని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు.
ఈరోజు ఆయన పత్రికలకు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని చెపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ కార్పొరేట్ విద్య, వైద్య దోపిడిని అరికట్టడానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని కోరారు.
రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తేవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు.ప్రైవేట్ కార్పోరేట్ విద్య వైద్య సంస్థలు ప్రజల రక్తమాంసాలతో వేలాది కోట్ల రూపాయల లాభాలను పొందుతూ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారిస్తున్నారని తెలిపారు.
విద్య వైద్య సంస్థల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ ( బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
