HomePOLITICAL NEWSArmoorనాటు కోళ్ల పై విష ప్రయోగం... మృతి చెందిన 80 కోళ్లు....

నాటు కోళ్ల పై విష ప్రయోగం… మృతి చెందిన 80 కోళ్లు….

డొంకేశ్వర్ మండలం గంగసముందర్ గ్రామంలో మోతే చిన్న సాయన్న అనే వ్యక్తి పెంచుకుంటున్న నాటు కోళ్ల పై గుర్తు తెలియని వ్యక్తి బియ్యం గింజలలో విషయాన్ని కలిపి కోళ్లకు చల్లడంతో దాదాపు 80 కోళ్ల వరకు మృత్యువాత పడ్డాయి.

దాంతోపాటు గొల్లసాయిలు అనే వ్యక్తి మేక కూడా ఆ విషపు గింజలను తిని మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే మోతే చిన్న సాయన్న అనే వ్యక్తి గ్రామంలో పిండి గిరిని నడుపుకుంటూ…

నాటు కోళ్లను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద వ్యక్తి.. అయితే తన నాటు కోళ్లకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బియ్యం లో మందు కలిపి పెట్టడంతో పెంచుకున్న కోళ్లతో పాటు పిల్లలు కూడా మొత్తం మృత్యువాత పడ్డాయని, గతంలో కూడా ఇలాగే చేశారని వాపోయాడు.

ఒక వ్యక్తి మీద అనుమానం ఉందని, పశువైద్యాధికారి సమాచారం అందించానని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

ఎంతో కష్టపడి కోళ్లను పెంచుకొని కుటుంబాన్ని నడిపిస్తున్నానని, ఒక్కొక్క కోడి మూడు కిలోల వరకు తూకం వచ్చేదని, గ్రామంలో బోనాల పండుగకు మంచి గిరాకీ ఉండేదని, దాదాపు లక్ష రూపాయల వరకు నష్టపోయానని వాపోతున్నాడు.

విష ప్రయోగం చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని, చిన్న తరహా నాటు కోళ్ల పరిశ్రమను స్థాపించుకొని జీవనం సాగిస్తున్న చిన్న సాయన్న ను అధికారులు ఆదుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments