HomeTelanganaHyderabadవిద్యాశాఖ లో బదిలీ ల కుదుపు ........కీలక అధికారులకు స్థాన చలనం

విద్యాశాఖ లో బదిలీ ల కుదుపు ……..కీలక అధికారులకు స్థాన చలనం

సాధారణ బదిలీలలో భాగంగా విద్యాశాఖ లో భారీఎత్తున బదిలీలు కుదిపేస్తున్నాయి. కీలక స్థానాల్లో పాతుక పోయి పనిచేస్తున్న అధికారులకు ఎట్టకేలకు స్థానం చలనం జరిగింది. రాష్ట్ర స్థాయి లో జాయింట్ డైరెక్టర్ మొదలు జిల్లా విద్యాశాఖ అధికారి దాక బదిలీ లు జరగడం చర్చనీయాంశం అయింది రాజీవ్ సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ గా ఉన్న రాజీవ్ హైదరాబాద్‌లోని ‘తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ’ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సోమి రెడ్డి హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ నియమితులయ్యారు.3.కె.సత్యనారాయణ రెడ్డి: వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సత్యనారాయణ రెడ్డి మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

అదనంగా ఈయనకు అడిషనల్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ లో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న మదనమోహన్ హైదరాబాద్ సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.మాసాబ్ ట్యాంక్ ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఉషారాణి హైదరాబాద్ సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ గా ఉన్న వెంకటనరసమ్మ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న ఈ విజయలక్ష్మి వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.పలువురు

///డీఈవో ల కు స్థాన చల//////

మేడ్చల్ డీఈవో గా ఉన్న విజయకుమారి మహబూబ్‌నగర్ డీఈవోగా బదిలీ అయ్యారు. వికారాబాద్ డీఈవో గా ఉన్న రేణుక మేడ్చల్ డీఈవోగా పోస్టింగ్ పొందారు. హైదరాబాద్ డీఈవో గా ఉన్న రోహిణి సంగారెడ్డి డీఈవోగా బదిలీ అయ్యారు.4.సుశీందర్ రావు: రంగారెడ్డి డీఈఓ స్థానం నుండి నల్గొండ డీఈవోగా బదిలీ అయ్యారు.నల్గొండ డీఈవో గా ఉన్న బిక్షపతి యాదాద్రి భువనగిరి డీఈవోగా బదిలీ అయ్యారు.

రేవతి రెడ్డి రంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా నియమితులయ్యారు.సంగారెడ్డి డీఈవో గా ఉన్న వెంకటేశ్వర్లు బదిలీ అయి, హైదరాబాద్ జిల్లా డీఈవోగానియామకం అయ్యారు .అసిస్టెంట్ డైరెక్టర్ గా హోదా లో పనిచేస్తున్న శాస్రి సిద్దిపేట జిల్లా డీఈవోగా నియామకం అయ్యారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments