బెట్టింగ్ యాప్‌లో సొమ్ము పోగొట్టుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట మండలం ఐలాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగరాజు(29) భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆన్లైన్ గేమ్స్‌లో మోసపోయి చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
