HomeLaw and Orderరోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..

జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారం నందు విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

విద్యార్థులు భవిష్యత్తులో ట్రాఫిక్ నిబంధనలను పాటించి వ్యక్తిగతంగా వారి ప్రాణాలను కాపాడుకుంటూ కుటుంబానికి దేశానికి బలం చేకూర్చాలని తెలిపారు. వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని తద్వారా ప్రమాదాల నివారణను చేపట్టి ప్రాణ నష్టాన్ని అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి అమర్నాథ్ మరియు
ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments