డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు రూరల్ ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే ఆదివారం నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద రూరల్ పోలీలుసు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా వెల్పూర్ కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
ఆ వ్యక్తిని సోమవారం జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా లక్ష్మణ్ అనే వ్యక్తికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు
