HomeCRIMEఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన జొమాటో డెలివరీని దోచుకున్నారు...

ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన జొమాటో డెలివరీని దోచుకున్నారు…

జొమాటో అన్ లైన్ లో బిర్యానీ ఆర్డర్ చేసారు అది డెలవరి చేయడానికి వచ్చిన సర్వీస్ బాయ్ ను తీవ్రంగా కొట్టి జేబులో ఉన్న నగదు తో పాటు బిర్యానీ కూడా లాక్కున్నారు అతని బైక్ ను సైతం వంతెన మీద నుంచి పడేసారు. నిజామాబాద్ నగరంనాలుగో టౌన్ స్టేషన్ పరిధి లోని అమ్మా నగర్ వద్ద సోమవారం అర్ద రాత్రి జరిగింది.

తమకు బిర్యానీ కావాలంటూ ఓ వ్యక్తి ఆన్ లైన్ లో జొమాటో లో రాత్రి 10:40 గంటలకు ఆర్డర్ పెట్టారు. బిర్యానీ ఆర్డర్ ను డెలివరీ ఇవ్వడనికి అహ్మద్ పురా కాలొనీ కి చెందిన అబ్దుల్ జునైద్ తన సొంత బైకు మీద వెళ్ళాడు. ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అడగడం తో అమ్మానగర్ మెయిన్ గెట్ వద్ద బిడ్జ్ వద్దకు రావాలని చెప్పడంతో అక్కడి కే వెళ్ళాడు.

తాగిన మైకం లో ఉన్న యువకులు సర్వీస్ బాయ్ వద్ద నుంచి బిర్యాని తీసుకోని డబ్బులు ఇవ్వకుండా మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు అతని జేబు లో నుంచి నగదు లాక్కున్నారు అంతటి తో ఆగకుండా అతని బైకు ను బిడ్జ్ మీద నుంచి కింది కి పడేసారు. తీవ్రంగా గాయపడ్డ జునైద్ ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments