HomeTelanganaNizamabadస్థానిక ఎన్నికలయ్యేదాకా ......సంస్థాగత ప్రక్షాళన లేనట్లేనా ....నేడు కాంగ్రెస్ సన్నాహకసమావేశం .....హాజరు కానున్న ఏఐసీసీ ఇంచార్జ్...

స్థానిక ఎన్నికలయ్యేదాకా ……సంస్థాగత ప్రక్షాళన లేనట్లేనా ….నేడు కాంగ్రెస్ సన్నాహకసమావేశం …..హాజరు కానున్న ఏఐసీసీ ఇంచార్జ్ , పీసీసీ చీఫ్ లు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తీ అయింది. అయినా పార్టీ సంస్థాగత ప్రక్షళన మొదలుపెట్టలేక పోతుంది. మహేష్ గౌడ్ పీసీసీ పగ్గాలు పట్టి అయిదు మాసాలు కావొస్తుంది. ఆయన సొంత జిల్లా లోనే పార్టీ ఎంతో బలహీనంగా ఉంది.

అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో వైఫల్యాలు వెక్కిరిస్తున్న సరే దిద్దుబాటు చర్యలకు మహేష్ నడుం కట్టలేక పోవడం క్యాడర్ లో చర్చ గా ఉంది గతంలో లోకల్ బాడి ఎన్నికల్లో నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుక పోయింది.

ఓటమి తాలుకు పరిస్థితులు కళ్ళముందే ఉన్నా పీసీసీ మాత్రం పార్టీప్రక్షళన మీద తనకేమి పట్ట నట్లుగా వుంటుంది. పార్టీ పదవుల్లో ఉన్న వారికి నామినేటెడ్ పదవులు దక్కినా సరే ఇంకా కొత్త వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వడానికి పీసీసీ ఆసక్తి చూపడం లేదు.

పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో నీనా సానుకూల ఫలితాలు సాధించడం అనివార్యం. ఆ దిశగా పార్టీ సైతం సంస్థాగతంగా పటిష్టంగా చేసుకోవాల్సిందే. కానీ దిగ్గజ నేతలున్న జిల్లాలో పార్టీ ప్రక్షళన అనుకున్నంత సువులువేమి కాదు అందుకే మహేష్ సైతం వెనుకాడుతున్నారు.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ మొదలైన నేపథ్యంలో పార్టీ లో సంస్తగత గత మార్పులు వికటించే ప్రమాదం వుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల మీదే ఫోకస్ పెట్టింది .ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.

ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది మొదట సర్పంచ్ ఆతర్వాత యంపిటీసీ జెడ్పిటిసి ఎన్నికలకు పక్రియ జరిపే లా ప్రభుత్వం కార్యాచరణ ఉంది.

ఈ మేరకు పీసీసీ నుంచి సైతం పార్టీ కీలక నేతలందరికి స్పష్టమైన సంకేతాలు సైతం వచ్చాయి. రైతు భరోసా మొదటి దఫా నిధులు రైతు ఖాతాల్లో జమ అవ్వగానే ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం పక్కా ప్రణాళిక తో ఉంది. అందుకే పీసీసీ సైతం ఆ మేరకు పార్టీ క్యాడర్ ను లోకల్ ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది.

లోకల్ బాడి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని ఈపాటికే అన్నీ డీసీసీలకు స్పష్టం చేసిన పీసీసీ ఎంపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేసింది.పీసీసీ అధ్యక్షడు సొంత జిల్లా నుంచే సమావేశాల షెడ్యూల్ మొదలు కాబోతుంది.

లోకసభ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షి పీసీసీ చీఫ్ లతో పాటు అవసరమైతే ఇతర పార్టీ పెద్దలు కూడా హాజరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ స్థాయి సమావేశం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో ఏర్పాటు చేసారు.

దీపా దాస్ మున్షి .పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లతో పాటు జిల్లాకు చెందిన దిగ్గజ నేతలందరినీ ఆహ్వానించారు. ముందుగా ఆయానియోజకవర్గాల్లో సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసి ఆ తరువాత తదుపరి కార్యాచరణ కు సిద్ధం కావాలనేది పీసీసీ ఆలోచన గాఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాకపోతే ప్రభుత్వ ప్రతిష్ట మసక బారే ప్రమాదం ఉంది. అదీగాక బిఆర్ యస్ పదేళ్లు అధికారంలో వుండడం వల్ల ఇంకా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చేరిక లను అదే పనిగా ప్రోత్సహించింది.

కానీ నేతల మధ్య సమన్వయం కుదరక పోవడంతో అనేకవివాదాలు తలెత్తి చేరికల ఆగిపోయాయి.అందుకే ఇంకా కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కి క్రియ శీలంగా ఉండే లీడర్ల లీడర్లు పోయారు. అందుకే సర్పంచ్ యంపిటీసీ లు ఎక్కువమంది గెలిస్తే పార్టీ మరోసారి క్షేత్ర స్థాయిలో బలోపేతం అయ్యే ఛాన్స్ వుంటుంది.

లోకల్ బాడి ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించే బాధ్యత కూడా ఎమ్మెల్యే లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతల మీదే పెట్టారు.ఎన్నికల ఫలితాలే ప్రాతిపదికగా పార్టీలోనూ ప్రక్షాళన చేయాలనేది పీసీసీ ఆలోచనగా ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments