HomeCRIMEకేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ ....ఏసీబీ కి రూట్ క్లియర్ ......రంగంలోకి దిగిన ఏసీబీ .....గ్రీన్...

కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ ….ఏసీబీ కి రూట్ క్లియర్ ……రంగంలోకి దిగిన ఏసీబీ …..గ్రీన్ కో సంస్థల్లో సోదాలు

బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హైకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను మంగళవారం కొట్టేసింది . ఏసీబీ ఈడీ విచారణలకు హాజరు కావడానికి కోర్టు కేసు సాకుగా చూపిస్తూ డుమ్మాకొడుతున్నారు. ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ క్రమంలోనే తీర్పు రాగానే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఫార్ములా ఈ-రేస్‌తో సంబంధం ఉన్న గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏక కాలంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. మాదాపూర్‌లోని ఏస్ నెక్ట్స్ జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలిపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్‌ కార్యాలయాల్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి.

అయితే, ఇవాళ గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ సంస్థలో సోదాలు పూర్తి చేసి.. పక్కా ఆధారాలతో ఈ నెల 9న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈసారి న్యాయ వాదీ లేకుండా విచారణకు రావాలని నిర్దేశించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments