హెల్మెట్వాడకంపై అవగాహన ర్యాలీని జెండాఊపి ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్,జిల్లా జడ్జి,అదనపు పోలీస్ కమిషనర్
జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా హెల్మెట్ వాడకంపై నిజామాబాద్ రవాణా శాఖ అధికారులు, పోలీసులు జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలిసులు, ఏఆర్, సివిల్ పోలీసులు హెల్మెట్ లు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలిని జిల్లా జిల్లా కలెక్టర్,జిల్లా జడ్జి,అదనపు పోలీస్ కమిషనర్ లు జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు జరుపుతారని ఆయన తెలిపారు.
ఉరుకులు పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు.
కావున ప్రజలు డ్రైవింగ్ చేసే సమయంలో తనిసరి హెల్మెట్ ను ధరించాలని సూచించారు. అలాగే కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా పెట్టువోవాలని తెలిపారు.
ప్రజల్లో అవగాహన కోసం ఈ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.అలాగే సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న పిల్లలు ఎక్కువగా పతంగులు వినియోగిస్తారు.
జిల్లాలో ఎక్కడ కూడా చైనా మాంజ విక్రయించకూడదని హెచ్చరించారు. చైనా మాంజ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ మేరకు చైనా మాంజ వాడకూడదని ఫ్లకార్ట్ లు ప్రారంభించారు.
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి..
జిల్లా జడ్జి కుంచాల సునీత..
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.హెల్మెట్ ధరించాక పోవడంతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.అలాగే జిల్లాలో ఎక్కడ కూడా చైనా మాంజ విక్రయించకూడదని హెచ్చరించారు.
చైనా మాంజ విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి, రూ లక్ష వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి,రవాణా శాఖ అధికారులు ఉమామేశ్వర్ రావు, ఏసిపి రాజా వెంకటరెడ్డి, నగర సీఐ,ఎస్ఐలు, ట్రాఫిక్ పోలిసులు,తదితరులు పాల్గొన్నారు.





