అడ్డగోలు రేట్లు …..బెనిఫిట్ షో లు ఉండబోవని బీరాలు పలికిన రేవంత్ సర్కార్ దిల్ రాజు అలియాస్ వెంకటరమణ రెడ్డి ముందు సాగిలా పడింది.
తాను పుట్టిన గడ్డమీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మీద కారుకూతలు కూసిన రెడ్డి సాబ్ అడిగిందే తడువుగా ముందుగా గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా అనుమతులు ఇచ్చేసింది.
అల్లు అర్జున్ సెటిల్ మెంట్ కోసం పడిన శ్రమకు తగిన సత్కారం సర్కార్ వారు సకాలం లోనే ముట్టజెప్పారు. జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు అనుమతి…
మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపు. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100 రూపాయలు పెంపు, జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి… జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకి అనుమతి ఇచ్చేసింది.
భారీ వ్యయం తో తీసిన సినిమా కదా అందుకే మొదటి రెండు వారాల్లోనే అయినకాడికి రాబట్టాలనే నిర్మాత ఎత్తుగడ కు సర్కార్ సైతం తనవంతుగా నజరానా ఇచ్చింది ఎలాగో ఇదే సినిమా ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా రేట్లు పెంచితే కూడా సర్కార్ ఖజానా కు ఫాయిదా అని దిల్ రాజు ను ఖుషి చేస్తూ నే రేవంత్ కూడా ఖజానా నింపుకో బోతున్నారు ఇంకా నయం సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు కు అనుమతి, బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించారు ఎలాగో టికెట్లు రేట్లు పెంచాం కదా అవీ కూడా ఇచ్చేస్తే పోలే ! అని భావించలేదు ఏం సమర్థనలు చెప్పుకున్నా వేస్ట్…
అసెంబ్లీ సాక్షిగా మాట తప్పి, స్పిరిట్ తప్పి, పరువు కోల్పోయాడనే టాక్ మొదలయ్యింది.అదికూడా తెలంగాణ ను తెల్ల కల్లు మటన్ దావత్ లతో పోల్చిన దిల్ రాజు కోసం సర్కార్ ఎన్నో మెట్లు దిగిపోయింది …ఢిల్లీలో మీడియా ముందు అసెంబ్లీ వేదికగా సాక్ష్యాత్తు సీఎం సినిమా నటుల పోకడల మీద ఘిం కారాలు తుస్సు మనిపించారు …
‘‘అబ్బే, టికెట్ రేట్లు పెంచబోమని చెప్పలేదు కదా, కేవలం బెనిఫిట్ షోలకు అనుమతించబోం అన్నాం కదా’’ అంటారేమో… ఐనా సరే, అది ఓ విఫల సమర్థనే . ప్రభుత్వం అసలు దిల్ రాజు ఎదుట ఇంతగా సాగిలబడాలా అనే టాక్ వస్తుంది అసలు నిజామాబాద్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రిరిలీజ్ ప్రమోషన్ సభకు అనుమతి ఇవ్వడమే తప్పు…
ఎందుకంటే పుష్పా తొక్కిస లాట విషాద ఘటన లో ఏవో వో బీరాలు పలికిన రేవంత్ ప్రభుత్వం ఇదే దిల్ రాజు సినిమా ఫంక్షన్ అనుమతి కోసం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. నిర్మాత ప్రైవేటు సినిమా దందా కోసం ఈ మీటింగులకు పర్మిషన్స్ ఇవ్వడం దేనికి…?
ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఇవ్వడం ఏమిటి..? దాంతో జనానికి ఒరిగే ఫాయిదా ఏమిటి..? సినిమావాళ్ల వ్యాపారానికి ప్రభుత్వం మరీ ఇంత సహకరించాలా? దిల్ రాజు సినిమా గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో తప్పు… నాలుగు రోజులు పోతే మళ్లీ బెనిఫిట్ షోలు మన్నూమశానం మళ్ళీ పునరావృత్తం అయినట్లే ?
పుష్పా ఘటన తో కనబర్చిన కఠిన ధోరణి నాలుగురోజులకే ఇలా నీరుకారిపోతుందా..? నిజమే కదా ..? ఆల్రెడీ అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చేశారు మరీ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ యువతి మృతి, ఓ పిల్లాడి చావుబతుకులు, ఓ పాన్ ఇండియా హీరో అరెస్టు…
ఎవరైతేనేం, తప్పు జరిగితే ఉపేక్షించబోం.., అనుచిత, అనవసర ఔదార్యాలు ఉండబోవని సీఎం సినిమా మంత్రి లు హెచ్చు స్వరం తో అన్న మాటలు ఆదిలోనే ఎందుకు తుస్సుమనిపించారో .మరి డాకూ మహారాజ్ గా సందడి చేయబోతున్న బాలయ్య చేసిన పాపమేమిటి,..?చంద్రబాబు సొంత వియ్యంకుడే కదా హీరో…
అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా దిల్ రాజు సినిమాయే కదా… ఇచ్చేయండి… ఒకసారి మెట్లు దిగిపోయాక ఇక మొహమాటాలేమిటి..? మీనమేషాలేమిటి..?
ఇంకా నైతిక విలువ మాటెక్కడా సినిమా టికెట్ రేట్ల పెంపుకి ఎందుకు అనుమతించాలో సరైన కారణాలు చెప్పగలడా ముఖ్యమంత్రి..? సినిమా నిర్మాణ వ్యయం పెరిగితే అది నిర్మాత రిస్క్… హీరోలకు అడ్డంగా దోచిపెట్టి, ఈమేరకు ప్రేక్షకులను బాదడం దేనికి..?
దానికి ప్రభుత్వమే అంగీకరించడం దేనికి..? హీరోలకు అడ్డగోలుగా సంపాదించి పెట్టాలా ప్రభుత్వాలు కూడా..!
