సంక్రాంతి వేడుకల్లో అపశృతినిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
