ఈ సంఘటన నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. నగరంలోని నాలుగో టౌన్ లో రెండవ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్.
సోమవారం రాత్రి వాహనాలు తనిఖీ చేసే క్రమంలో అటువైపు వెళుతున్న ఓ గుర్తు తెలియని కారు ఢీ కొట్టి పరారయింది. ఎస్సై కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్పృహ కోల్పోవడంతో స్థానికులు గమనించి హుటాహూటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
