Friday, April 24, 2026
HomeTelanganaNizamabadస్నేహితుని కుటుంబానికి అండగా '2013 బ్యాచ్'కానిస్టేబుల్

స్నేహితుని కుటుంబానికి అండగా ‘2013 బ్యాచ్’కానిస్టేబుల్

కష్టాల్లో ఉన్న స్నేహితుని కుటుంబాన్ని ఆదుకునేందుకు 2013 బ్యాచ్ కానిస్టేబుల్ మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల అకాల మరణం చెందిన తమ బ్యాచ్‌మేట్ అనిల్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన సహచర మిత్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

అనిల్ మృతితో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన భార్యాపిల్లల భవిష్యత్తు కోసం మిత్రులంతా కలిసి రూ. 6,04,500 నగదును సేకరించారు. ఈ మొత్తాన్ని అనిల్ ముగ్గురు కుమార్తెల పేరిట సురక్షితమైన పొదుపు పథకాల్లో జమ చేశారు.

చిన్నారుల చదువు, భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద పాప పేరు మీద రూ. 2,00,000, రెండో పాప పేరు మీద రూ. 1,50,000, మరియు చిన్న పాప పేరు మీద రూ. 1,50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. మిగిలిన రూ. 1,04,500 నగదును తక్షణ ఖర్చుల నిమిత్తం అనిల్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా 2013 బ్యాచ్ సభ్యులు మాట్లాడుతూ.. “మిత్రుడు అనిల్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, అతని కుటుంబానికి అండగా ఉండటం మన బాధ్యత.

మన బ్యాచ్ ఐకమత్యం ఇలాగే కొనసాగుతూ ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలి” అని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!