HomeCRIMEనగరంలో కత్తిపోట్ల కలకలం..

నగరంలో కత్తిపోట్ల కలకలం..

నగరంలో ఒక్కసారిగా కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి శాంతినగర్‌ పరిధిలోని బాబా కిరాణా దుకాణం వద్ద గుర్తుతెలియని వ్యక్తి, మరో వ్యక్తిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.ఈ ఘటన నగరంలోని చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. శాంతినగర్‌లోని ప్రధాన కూడలి వద్ద ఉన్న బాబా కిరాణా షాపు సమీపంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ఒక వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో అవతలి వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేశాడు.

కడుపు భాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments