అవినీతి అధికారుల వేట లో ఏసీబీ దూకుడు అలాగే కొనసాగుతుంది ఒక్కో శాఖలో ఒక్కరి ని అన్నట్లుగా వేటాడుతుంది తాజాగా పోలీస్ శాఖలో డిఎస్పీ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పటాన్ చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి ఇండ్లల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ల పరిధిలో పనిచేసిన భీమ్ రెడ్డి పై ఎసిబి పక్క సమాచారం తో దాడులు చేసింది . గురువారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ లోని నార్సింగిలోని ఆయన నివాసం తో పాటు రాష్ట్రంలోని 12 చోట్లలో అవినీతి నిరోధక శాఖాధికారులు తనిఖీలు చేపట్టారు.
డజన్ కు పైగా ప్రాంతాల్లో జరిగిన భీమ్ రెడ్డి ఇండ్లలో, ఆయన బంధువులు, సన్నిహితులు ఇండ్లలో సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం గుర్తించారు.
