HomeCRIMEఐజి ఎంట్రీ తో మెక్కిన కాసులు కక్కిన ఏసీపీ .....సిపి ఆగ్రహం .మరో ఏసిపి...

ఐజి ఎంట్రీ తో మెక్కిన కాసులు కక్కిన ఏసీపీ …..సిపి ఆగ్రహం .మరో ఏసిపి ని రంగంలోకి దింపిన వైనం …

పోలీసు శాఖ లో ఆయనో ఏసీపీ జిల్లా కేంద్రంలో కీలక విభాగంలో అదికూడా సీపీ పర్యవేక్షణలో ఉండాలిన్స సదురు అధికారి తనకు సంబంధం లేని ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తలదూర్చారు. ఇంకేముంది.

బాధితుడి కి ఇవ్వాల్సిన నగదు ను మెక్కేయడానికి పక్కా ప్లాన్ వేసాడు. నిందితుడి ఇచ్చిన నగదు తనవద్దే పెట్టుకొని ఇంకా వసూలు కాలేదంటూ బుకాయించడమే కాదు. రావాల్సిన డబ్బు కోసం సదురు బాధితుడు జిల్లా కేంద్రంలోనే ఓ హోటల్ లో వుంటూ రోజు ఆ ఏసీపీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు.

చివరికి ఏసిపి వైఖరి మారింది కొత్వాల్ ఉల్టా చోర్ కు డాటే అన్న చందంగా బాదితుడినే గద్దించాడు. వ్యవహారమేదో తేడా కొట్టడంతో ఓ ఐజి ని ఆశ్రయించాడు. ఆయన సీపీ దృష్టి కి తేవడంతో ఆయన ఈ కేసు ను మరో ఏసీపీ కి అప్పగించాడు.

ఆయన బాధితుడి పిర్యాదు మేరకు నిందితుల మీద కేసు నమోదు చేసి అప్పటికే నిందితుడు ఇచ్చిన నగదు ను సదురు ఏసీపీ నుంచి రికవరి చేసి బాధితుడికి అప్పగించారు. మిగిత నగదు ఇవ్వడానికి సైతం ఈ నెలాఖరు వరకు గడవు తీసుకున్నారు.

ఏపీ లో ని ఏలూరు ప్రాంతానికి చెందిన ఓ రొయ్యల వ్యాపారి ఆర్థిక అవసరాల కోసం నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పరిధి లో ఉండే బడా వడ్డీ వ్యాపారి ని ఆశ్రయించారు. సదురు వ్యాపారి కి సుమారు నాలుగు కోట్ల అప్పు కోసం రూ 60 లక్షలు ముందుగానే ఇవ్వాలని ఒప్పందం జరిగింది.

దీనితో ఏలూరు కు చెందిన రొయ్యల వ్యాపారి ఆ మొత్తం నగదు నిజామాబాద్ వచ్చి వడ్డీ వ్యాపారికి ఇచ్ఛేసారు. నాలుగు కోట్లు పది రోజుల్లో సర్దు బాటు చేస్తామని వడ్డీ వ్యాపారి మాట ఇచ్చారు. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు నాలుగు కోట్లు ఇవ్వడంలో జాప్యం జరిగింది.

దీనితో రొయ్యల వ్యాపారి అప్పుకోసం తిరిగి వేసారు పోయాడు. చివరికి తానిచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వడ్డీ వ్యాపారి పట్టించుకోలేదు. దీనితో బాధితుడు నేరుగా హైదారాబాద్ లో తెలిసన వారి ద్వార ఐజి రంగ నాద్ నుకలిశారు ఆయనవారిని నిజామాబాద్ సీపీ వద్దకు పంపాడు.

ఆయన నేరుగా ఓ లా అండ్ ఆర్డర్ కాకుండా ఓ విభాగంలో ఉండే సీఐ ఈ పనేదో చూడాలని పురమాయించాడు. సదురు సీఐ రంగంలోకి దిగి డబ్బులు ఇవ్వాల్సిన వడ్డి వ్యాపారిని పిలిపించి విచారిస్తున్న క్రమంలో అదే విభాగంలో ఉండే ఏసీపీ ఎంట్రీ ఇచ్చి సీఐ ను పక్కకు పెట్టేసి వడ్డి వ్యాపారి స్వయంగా విచారించాడు.

బాధితుడికి డబ్బులు ఇవ్వాల్సింది నిజమే నని ఒప్పుకున్నాడు. మొత్తం రూ 60 లక్షల నగదు లో రెండు వాయిదా లో 30 లక్షల రూపాయలు వడ్డి వ్యాపారి నుంచి వసూలు చేసాడు.

ఏలూరు నుంచి వచ్చిన వ్యాపారి స్థానిక కృష్ణ హోటల్ లోనే ఉండిపోయాడు. కానీ వడ్డి వ్యాపారి నుంచి వసూలు చేసిన నగదు ను బాధితుడికి ఇవ్వడానికి ఏసీపీ మీన మేషాలు లెక్కించాడు. బాధితుడు రోజుల తరబడిగా ఏసిపి చుట్టూ తిరిగి వేసారి పోయాడు.

డబ్బులు ఇవ్వక పొగ సదురు ఏసిపి తననే గద్దించడం తో బాధితుడు మరోసారి ఐజి ను కలసి జరిగిన బాగోతం ఏసీపీ నిర్వాహకం చెప్పేసాడు. అయిన నేరుగా ఈ విషయం సీపీ దృష్టి కి తెచ్చాడు. ఏసీపీ నిర్వాహకంఫై సీపీ నిప్పులు చెరిగారు.

ఈ వ్యవహారం లా అండ్ ఆర్డర్ ఏసీపీ కి అప్పగించారు. ఆయన రంగంలోకి దిగి మొదట మూడో టౌన్ లో బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. వడ్డి వ్యాపారి నుంచి వసూలు చేసిన రూ 30 లక్షల ను సదురు ఏసీపీ నుంచి ముక్కు పిండి వసూలు చేసి బాధితుడి కి అప్పగించారు.

మిగితా నగదు ఆగస్టు మొదటి వారంలో ఇచ్చేస్తాని చెప్పినట్లు సమాచారం. అసలు వడ్డి వ్యాపారి నుంచి వసూలు చేసిన ముప్పై లక్షల నగదు బాధితుడి కి ఇవ్వకుండా మీ వద్దే ఎందుకు దాచుకున్నారని ఏసీపీ గద్దించి అడిగితె మొత్తం డబ్బు వచ్చాక ఇచ్చేద్దామనుకున్న అంటూ బుకాయించి నట్లు సమాచారం. ఏసీపీ నిర్వాకం ఫై సీపీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments