ప్రమాదవశాత్తు మద్యం మత్తులో కల్వర్టు పై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఏఎస్ఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం. ప్రకాశం జిల్లాకు చెందిన నాళ్ళబోతుల నారాయణ(47).మేస్త్రి పనులు నిమిత్తం గత పది సంవత్సరాల క్రితం మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జీవనం గడుపుతున్నారు.
ఈ మేరకు సోమవారం మద్యం సేవించి ఇంటి ముందు ఉన్న కల్వర్టు పై కూర్చొని ఉన్నాడు. మద్యం మత్తులో ఒక్కసారిగా కల్వర్టు పై నుంచి నీటిలో పడిగా తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు.