హిందూ ఆరాధ దైవమైన సీతాదేవి చిత్రీకరణను అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై. తీసుకోవలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి,అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ,బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి శనివారం పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.
హిందువుల ఆరాధ దైవమైన సీతాదేవి చిత్రీకరణను. అసభ్యకరంగా చిత్రించిన వారిపై చట్టరిత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అయిన వినయ్ కుమార్ రెడ్డి యొక్క సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరిచి హేళన చేశారని ఆయన మండిపడ్డారు.
సీతాదేవి చిత్రీకరణను అసభ్యంగా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామంటూ ఆయన తెలిపారు.