నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా న్యాయ విద్యార్థిని నామినేషన్.నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి న్యాయ విద్యార్థిని చరిత రావు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆమె మాట్లాడుతూ.తాను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అలాగే మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. అభివృద్ధి చెందిన దేశం అని మనం గర్వంగా చెప్పుకునే రోజు తొందరలో రావాలని.
ఆమె పేర్కొన్నారు. రాజకీయ అనుభవిజ్ఞులైన రాజకీయ నాయకులతో సమానంగా యువత కూడా ముందుకు వచ్చి పోటీ చేయాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోని అన్ని నియోజకవర్గాలలో సమస్యలను నిర్మూలించాలన్న.
నిరుద్యోగం అంత పొందించాలన్న యువత తప్పనిసరిగా నడుం బిగించి ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు. ఉక్కు సంకల్పం పట్టుదల ఆవేశం. ఆశ ఉన్న యువత. తోడైతే ఊహించని అభివృద్ధిని చూడగలమని ఆమె పేర్కొన్నారు.