యువకుడి ప్రాణాన్ని బలిగొన్న.. సైబర్ నేరగాళ్ళు -ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మోతే నాగరాజు అనే యువకుడి ఆత్మహత్య -నాగరాజు నుండి 5 లక్షల డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్ళు-వారి బాధితులు తార లేక ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి -సైబర్ నేరాలని అరికట్టాలని కోరుతున్న ప్రజలు జాన :రమేష్ ఇది సంగతి: ఆర్మూర్;
రోజు రోజుకి సైబర్ నేరగాళ్ళ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ వీళ్ళ పాలిట వరంగా మారిందా అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఎప్పుడు? ఎలా ? సైబర్ నేరానికి పాల్పడుతున్నారో అంచనాకు అందడం లేదు. దీంతో అమాయక యువకులు బలవుతున్నారు. తాజాగా ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మోతే నాగరాజు అనే యువకుడు ఈ నేరగాళ్ళ ఉచ్చులో పడి తన ప్రాణాన్ని కోల్పోయాడు.
వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన మృతుడు మోతే నాగరాజు ఇటీవలే నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్లే స్టోర్ లో తనకు తెలియని ఓ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడంతో సైబర్ నేరగాళ్లు నేరుగా మృతుడు నాగరాజుకు ఫోన్ చేసి తమకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేనియెడల కేసులు బుక్ చేస్తామని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూ వేధించసాగారు. వారి వేధింపులను భరించలేక నాగరాజు ఇంటి వద్ద రెండు రోజుల కిందట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దీంతో హుటాహుటిన నిజామాబాదు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు .
ఈ ఘటన తో మగ్గిడి గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. పోలీసులు సైబర్ నేరగాల నుంచి యువతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.