కామారెడ్డి లో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కాయి సోషియల్ మీడియా వేదిక సాగిన దుష్ప్రచారాలు ఇప్పుడు పోలీసు పిర్యాదు లు దాక వెళ్లాయి. సీఎం తమ్ముడు కొండల్ రెడ్డి మాజీ మంత్రి సీనియర్ నేత షబ్బీర్ అలీ మధ్య ఆధిపత్య పోరు పోలీసుల దాక వెళ్ళింది.
తెరమీది గడ్డం చంద్ర శేఖర్ ఉన్న తెరవెనుక మాత్రం దిగ్గజ నేతలే పావులు కదులుతున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్యమాజీ మున్సిపల్ ఛైర్మెన్ గడ్డం ఇందుప్రియ శుక్రవారం షబ్బీర్ తో ఆయన అన్న కొడుకు ల మీద పోలీసులకు పిర్యాదు చేసి షబ్బీర్ అలీ నే లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పార్టీ అధికారం లోకి వచ్చిన తోలి నుంచే కామారెడ్డి లో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది.
ఎన్నికలో రేవంత్ పక్షాన ఆయన తమ్ముడే క్రియాశీలకంగా పనిచేసారు అదే ఎన్నికలో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా పోటీచేయడంతో ఆయన వర్గం గంప గుత్తగా నిజామాబాద్ వచ్చేసారు. ఈ క్రమంలోనే తెరాస లో ఉన్న చంద్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరి కొండల్ రెడ్డి వెన్నంటే ఉండి పనిచేసారు.
అందుకే ఎన్నికల తర్వాత ఆయన ఆవే సంబంధాలు కొనసాగిస్తున్నారు. అర్బన్ లో ఓడిపోయిన షబ్బీర్ తిరిగి కామారెడ్డి కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. షబ్బీర్ అలీ అర్బన్ నుంచి పూర్తీ స్థాయిలో తప్పుకొని కామారెడ్డి కి పరిమితం కావాలని పీసీసీ చీఫ్ మహేష్ అంతరంగంగా ఉండే.
కానీ షబ్బీర్ రెండు నియోజకవర్గాల్లో పెత్తనం సాగిస్తూ వస్తున్నారు అదే మహేష్ తో పాటు అనేక మంది సీనియర్లకు నచ్చలేదు ఈలోపు చంద్ర శేఖర్ రెడ్డి పీసీసీ ప్రధాన కార్యదర్శి గా నియామకం కావడంతో షబ్బీర్ అలీ వర్గం రగిలి పోయింది. మహేష్ ప్రోద్బలం తో ఆ పదవి వచ్చిందంటూ షబ్బీర్ డిల్లీ పెద్దల వద్ద వాపోయాడు కానీ సీఎం రేవంత్ సిఫార్స్ వల్లే నియామకం జరిగిందని మహేష్ అప్పట్లో నే కౌంటర్ ఇచ్చాడు కానీ ఈలోపు చంద్ర శేఖర్ రెడ్డి ని పేలుడు పదార్థాలు కేసులో పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది.
చివరికి కొండల్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో జస్ట్ మూడో రోజే బెయిల్ వచ్చింది. ఇక అప్పటి నుంచి చంద్ర శేఖర్ రెడ్డి మరింత బలంగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు మొన్నటి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పది వార్డు ల్లో తన వర్గీయులకు టికెట్లు వచ్చేలా కూడా చక్రం తిప్పాడు.
మరో వైపు ఎల్లారెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే లు సైతం షబ్బీర్ అలీ నే టార్గెట్ చేస్తున్నారు డీసీసీ అధ్యక్షుడి నియామకం లోనూ షబ్బీర్ అలీ పాచిక లు పారలేదు. ఈ నేపథ్యంలో చంద్ర శేఖర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షబ్బీర్ అలీ వర్గీయులు పీసీసీ కి పిర్యాదు చేసారు లేదు షబ్బీర్ అలీ పార్టీ నాశనం చేస్తున్నారంటూ చంద్ర శేకర్ రెడ్డి సైతం పిర్యాదు చేసాడు దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే షబ్బీర్ అలీ ఓ కాంగ్రెస్ నేత తో మాట్లాడిన మాటలు సోషియల్ మీడియాలో వైరల్ అయింది.
ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ మీద షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేసి నట్లుగా ఈ ఆడియో క్లిప్ వైరల్ అయింది. మరుసటి రోజు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ఇందుప్రియ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆమె క్యారెక్టర్ ఫై బురద చల్లే విధంగా పోస్టు వైరల్ అయ్యాయి.
ఈ పోస్టు ల వెనుక షబ్బీర్ అలీ అన్న కొడుకు షేరు ఉన్నాడనేది ఆమె పిర్యాదు బయట దేశాల నుండి సోషల్ మీడియాలో తన మీద అసభ్య పోస్టులు వేయిస్తున్నారని ఆమె తన పిర్యాదు లో పేర్కొన్నారు షబ్బీర్ అలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆమె తెగేసి చెప్పారు
