సైబర్ నేరగాళ్ల ఉచ్చు లో పడి ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్మూర్ పట్టణం కు చెందిన నాగరాజు నిషేదిత గేమింగ్ యాప్ ను తన ఫోన్ లో డౌన్ లోడ్ చేసికొని ఆడుతున్నాడు. గుర్తితెలియని వ్యక్తులు నాగరాజు వారం రోజుల క్రితం ఫోన్ చేసారు తాము సిబిఐ అధికారులమని నిషేదిత యాప్ లో గేమ్ ఎలా ఆడుతున్నావు అంటూ గద్దించారు.
కేసు అవుతుందని భయపెట్టారు లేదంటే అయిదు లక్షలు ఇవ్వాలని బేరం మొదలు పెట్టారు.అదే పనిగా డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో రెండు రోజుల క్రితం ఆత్మ హత్య యత్నం చేసాడు. కుటింబీకులు హుటాహుటిన జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు