నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు అధికంగా చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం వర్షం అధిక వర్షపాతం నమోదు కావడంతో నీరు చేరిందనీ ప్రయాణికులు వాపోతున్నారు.
అందుకు ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అరోపణలు చేస్తోన్నారు. జిల్లా కేంద్రంలోనే బస్టాండ్ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
ఇక వర్షాకాలం వస్తే చాలు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని గుంతలు నీటితో నిండి ప్రయాణికులకు అస్వస్థతలు ఏర్పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ చెరువుల తలపిస్తుంది. పలు సార్లు ప్రయాణికులు ఈ బురదలో వాహనాలు జారిపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.దీంతో బస్టాండ్ కు వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ కు రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు వస్తుంటాయి.రోజుకు వేలాది మంది ప్రయాణలు చేస్తుంటారు.లక్షల్లో ఆదాయం వస్తున్నా బస్టాండ్ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదను విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ బస్టాండ్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారైందనీ ప్రయాణికులు వాపోతున్నారు.
ఎంతో మంది రాజకీయ నేతలు జిల్లాలో ఉన్న ప్రయోజనం ఏం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు బస్టాండ్ ను పరిశీలించడం తప్ప, అధికారులు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆచరణకు నోచుకోని నిజామాబాద్ బస్టాండ్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్యం నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొకుండ చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
