నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ గా బి.తారాచంద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పి.రామ్మోహన్ ప్రకటించారు. ఈ ఎలక్షన్ కు కామారెడ్డి డిప్యూటీ రిజిస్ట్రార్ పి.రామ్మోహన్ ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించారు .
సహకార సంఘాల ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం నిజామాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించినట్లు ఎలక్షన్ ఆఫీసర్ రామ్మోహన్ తెలిపారు.
ఈ పదవికోసం డిచ్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బి.తారాచంద్ నాయక్, కామారెడ్డి జిల్లా గాంధారి పీఏసీఎస్ చైర్మన్ పి.సాయన్నలు నామినేషన్లు దాఖలు చేశారు.
సాయన్న తన నామినేషన్ ను ఉపసంహరించుకోగా, చైర్మన్ బరిలో తారాచంద్ నాయక్ ఒక్కరేమిగలడం ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఛైర్మెన్ గా ఉన్న సాంబార్ మోహన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పదవీ లో కొనసాగే అర్హత కోల్పోయారు.
ఆయన ఛైర్మెన్ గా ప్రాతినిధ్యం వహించే ఇందల్వాయి సింగిల్ విండో లో ఆయన మీద అవిశ్వసం ప్రతిపాదించారు. దీనితో కాంగ్రెస్ లో చేరి పదవీ కాపాడుకోవడానికి మోహన్ యత్నించారు.