HomeTelanganaNizamabadపదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి తేదీల ప్రకటన…

పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి తేదీల ప్రకటన…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 18వ తేదీలోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ గడువు దాటితే, ఆలస్య రుసుముతో కలిపి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు,రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.

మరింత సమాచారం కొరకు విద్యార్థులు http//bse.telangana.gov.in వెబ్ సైటు ను సంప్రదించగలరు మరియు పైన పేర్కొన్న విషయం లో ఏదైనా సందేహాలు ఉన్నచో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని 103 రూమ్ నంబర్ నందు విద్యాశాఖాధికారి కార్యాలయం లో సంప్రదించగలరనీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments