ఇంటికే ఆర్టీసీ పార్శల్లు డెలివరీని మెరుగుపరిచేందుకు టీజీ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కార్గో డెలివరీ ఐటెమ్స్ తీసుకోవాలంటే బస్టాండ్‌కి వెళ్లాల్సి వచ్చేది.
కానీ ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు హోం డెలివరీ చేస్తారు. ఈ కార్గో సేవల్ని ముందుగా హైదరాబాద్‌లో ఫైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇక నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు నిజామాబాద్ కార్గో పాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ లో లాజిస్టిక్ అవగాహన ర్యాలీ ని నిర్వహించారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హోం డెలివరీ చార్జీలివే…
0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50,
1.01నుంచి 5 కేజీలకు రూ.60,
5.01 నుంచి 10 కేజీలకు రూ.65,
10.1 నుంచి 20 కేజీలకు రూ.70,
20.1 నుంచి 30 కేజీలకు రూ.75,
30.1 కేజీలు దాటితే.. రూ.75 పైన ఉంటాయని పేర్కొన్నారు.
కార్గో సేవలు హోం డెలివరీ కొరకు…
ఆర్మూర్ డిపో -7396889496. బోధన్ డిపో 9014296638. నిజామాబాద్-1 డిపో-9154298727. నిజామాబాద్-2 డిపో-7396889496. బాన్సువాడ డిపో-9154298729. కామారెడ్డి డిపో-9154298729. ఆర్. యం. ఆఫీసు-8639963647. ను సంప్రదించాలనీ సూచించారు.
