రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే సురక్షిత ప్రయాణం సాధ్యమని ముగ్పాల్ ఎస్ఐ సుస్మిత పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు
రోడ్డు ప్రమాదాల నివారణపై డ్రాయింగ్,పెయింటింగ్,డ్రామా పోటీలు నిరహించినట్లు తెలిపారు. విద్యార్థులు గీసిన చిత్రాలు సందేశాత్మకంగా సాగాయి. ముఖ్యంగా రహదారి నిబంధనలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, స్కిట్లు ఆలోచింపజేశాయి.
సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మార్కెట్ ఏరియాలో భారీ ర్యాలీ నిర్వహించారు.
చేతిలో ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
