HomeTelanganaNizamabadబంద్ కు కదులుతున్న బీసీ సంఘాలు .....మద్దతు ప్రకటించిన ప్రధాన పార్టీలు ......అధికార పార్టీ సైతం

బంద్ కు కదులుతున్న బీసీ సంఘాలు …..మద్దతు ప్రకటించిన ప్రధాన పార్టీలు ……అధికార పార్టీ సైతం

శనివారం నాటి బంద్ కు బీసీ సంఘాలు సంఘటితంగా కదులుతున్నాయి. జేఏసీ తలపెట్టిన బందు కు ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతూ ప్రకటించాయి.

అధికార పార్టీ సైతం బంద్ లో క్రియాశీలకంగా ఉండలని పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్ పిలుపు నిచ్చారు. బీసీ లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కలిపించాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ శనివారం బంద్ కు పిలుపు నిచ్చింది.

బీజేపీ బిఆర్ యస్ తో పాటు టిజెఎస్, బీఎస్పీ లతో పాటు వామపక్షలు లు బంద్ మద్దతు ఇచ్చాయి. మరో వైపు బీసీ జేఏసీ జిల్లాలో ఆయా కుల సంఘాలను సంప్రదిస్తున్నాయి.

శనివారం బంద్ లో పాల్గొనాలని కోరుతున్నాయి. బిసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిసి బంద్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని మానాల మోహన్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడిక్కడ బిసి బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తుంది.

కాంగ్రెస్ పార్టీ బిసి పక్షాన నిలబడుతూ బిసి లకు న్యాయం జరిగేలా చూసే పార్టీ అని తెలుపుతున్నాను.రేపు బిసి బంద్ కారణంగా బాన్సువాడ నియోజకవర్గం లో నిర్వహించే డిసిసి అధ్యక్ష సమావేశం రద్దు చేశామన్నారు. బీసీ జెఏసి తలపెట్టిన బంద్ లో తాము పాల్గొంటామని బిఆర్ యస్ సీనియర్ నేతలు ఠాకూర్ సుజిత్ సింగ్ సత్య ప్రకాష్ లు పేర్కొన్నారు.

గతంలోనూ కెసిఆర్ బీసీ ల రిజర్వేషన్ కోసం తాపత్రయ పడ్డారని వారు గుర్తు చేసారు. బీసీ లకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడలని తెలంగాణ జనసమితి నేతలు జేసి కి ఇచ్చిన వినతి పత్రం లో కోరారు. బంద్ కు బీసీ సంఘాల కదిలి రావాలని ఆ పార్టీ నేతలు కిరణ్ వెంకట్ లు పిలుపు నిచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments