HomeTelanganaNizamabadబీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు

బీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు

ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు ప్రకటించారు

రేపటి బీసీ బంద్‌కు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తోంది.

బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బీసీల పక్షానే ఉంటుంది. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ లేకుండా, బీసీలకు న్యాయం చేయాలనే విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా, అనేక రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులను బీజేపీ పార్టీనే చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీజేపీపై బురద చల్లే రాజకీయాలు చేస్తోంది. మతపరమైన రాజకీయాలు మానుకుని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

రేపటి బీసీ బంద్‌ను విజయవంతం చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తున్నాం దినేష్ పటేల్ కులాచారిజిల్లా అధ్యక్షులు, బీజేపీనిజామాబాదు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments