Monday, May 4, 2026
HomeCRIMEఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి.. పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం..పోలీస్ కమిషనర్...

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి.. పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం..పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య .

రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు.

మంగళవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అధికారులతో ఆయన నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, రోడ్డు ప్రమాదాల నివారణపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని సీపీ స్పష్టం చేశారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని సూచించారు. అసాంఘిక శక్తులు, గొడవలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పెండింగ్ కేసులపై సీపీ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా: పోక్సో (POCSO) కేసులు: గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ నాణ్యతతో కూడి ఉండాలని, త్వరితగతిన చార్జీషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారికి సీసీటీఎన్ఎస్ పై పూర్తి అవగాహన ఉండాలని, స్టేషన్ మేనేజ్‌మెంట్‌లో పారదర్శకత పాటించాలని సూచించారు.

గస్తీ ముమ్మరం చేసి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతకే పెద్దపీటరోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయించాలి.డ్రంకన్ డ్రైవ్, అతివేగం, మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదంగంజాయి, డ్రగ్స్, జూదం, మరియు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిని వదిలిపెట్టవద్దని సీపీ హెచ్చరించారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, బాధితులు వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేసేలా చైతన్య పరచాలని కోరారు.ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీలు రాజ వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!