వేల్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అన్న చందంగా తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించడంతో, అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే వేముల మాటలను నిరసిస్తూ , సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తో పాటు ఇటీవల నూతనంగా వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి నర్సారెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యలను ఎత్తిచూపు తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించగానే, అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వ హాయంలో జరిగిన పెళ్లిళ్ల చెక్కులను పంపిణీ చేస్తున్న
ఈ కార్యక్రమంలో… కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు ఎందుకు మోపుతున్నారు అంటూ ఆగ్రహించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ విషయమై వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు ఉధృత నెలకొంది.
అయితే తిరిగి మళ్ళీ వేముల ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలను సముదాయించడంతో కార్యక్రమాన్ని ముగించుకొని వెను తిరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి కాంగ్రెస్ వర్సెస్ బి ఆర్ ఎస్ పార్టీల నేతలు బాహబహికి దిగడం బాల్కొండ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో రసాభాస నెలకోంది.
