రెండు సంవత్సరాలు గా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ లో ఉంటే ఇప్పించలేని దద్దమ్మ ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు సోయి తప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంనుంచి పెండింగ్ ఉంచిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి తులం బంగారం ఏది అని ప్రశ్నిస్తున్న ప్రశాంత్ రెడ్డికి బుద్ది జ్ఞానం ఉందా లేదా అని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు షాది ముబారక్ ,కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కులు దాదాపు 40000 కోట్లు పెండింగ్ లో ఉంచిన దుర్మార్గులు టిఆర్ఎస్ నాయకులని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రానికి 7లక్షల కోట్ల అప్పును,40వేల కోట్ల బకాయిలను వుంచింది టిఆర్ఎస్ నాయకులని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తుందని,టిఆర్ఎస్ పార్టీ లాగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇవ్వలేదని,ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ అని,ఇంటికొక ఉద్యోగం అని,దళిత ముఖ్యమంత్రి అని ప్రజలను మోసం చేసిన టిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పై మాట్లాడే నైతిక హాకు లేదు.
కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులని ఎక్కడికక్కడ నిలదీయాలని కాంగ్రెస్ నాయకులకు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
