ఏళ్లతరబడి వ్యాపార లావాదేవీలలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వారు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేక బిచాణా ఎత్తేసి వెళ్లిపోతున్నారు.
చేసిన అప్పులు తీర్చలేక …ఎప్పుడు ఇస్తామనేది చెప్పలేక …..చెల్లించడానికి చేతిలో చిల్లి గవ్వలేక అప్పించిన వారి ఒత్తిడి భరించలేక రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లి పోతున్నారు.అప్పు ఇచ్చిన వారంతా లబోదిబో మంటూ గుండెలు బాదుకుంటున్నారు.
ఇలాంటి ఉదంతాలు జిల్లా కేంద్రంలో వరుసగా వెలుగు చూస్తున్నాయి.బాధితులు పోలీస్టేషన్ లకు బారులు తీరుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నా బాధితుల చేతికి చిల్లి గవ్వ దొరకడం లేదు.
అధిక వడ్డీ వసూలు చేస్తున్నారంటూ నగరంలో వడ్డి వ్యాపారుల ఇండ్ల మీద విరుచుక పడి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఇలాంటి ఉదంతాలఫై కఠిన చర్యలు తీసుకోలేక పోతున్నారు.
తెలంగాణ స్థాయిలో ఖ్యాతి పొందిన గన్ని సంచులు వ్యాపారి దశాబ్దాల తరబడి ఇదే దందా లో తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఆయనకు కనీసం భోజనం చేయడానికి కూడా తీరిక ఉండదనే టాక్ ఉండే.
బాగ నగదు ఉన్న వారు ఆయనకు పోటీ పడి నా మాత్రవడ్డి కి డబ్బులు ఇచ్చే వారు క్రమం తప్పకుండ వడ్డి ముట్టజెప్పే వాడు అసలు కూడా అడిగిన వెంటనే ముట్టజెప్పేది.అందుకే ప్రముఖులు సైతం బ్లాక్ మని ని ఇతని వద్ద దాచేది.
కానీ సదురు వ్యాపారి అనూహ్యంగా ఆర్థిక కష్టాల్లో చిక్కాడు. వడ్డి పద్దుగా ఇచ్చిన కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చేసేది లేక నగరం నుంచి బిచాణా ఎత్తేసాడు.
పోలీసులు పిర్యాదు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు కానీ బాధితులు మాత్రం భారీగానే ఉన్నారు. ఆయన దాదాపు రూ 25 కోట్ల మేరకు అప్పుల్లో ఉన్నాడని చెప్తున్నారు.నగరంలో పేరుమోసిన ఓ హోల్ సెల్ బంగారు వ్యాపారి నగరంలో అయిదు కోట్ల మేరకు అప్పులు చేసి ఉడాయించాడు.
బంగారు గొలుసులు ముంబయి గుజరాత్ లనుంచి తెచ్చి హోల్ సెల్ లో విక్రయించే సదరు వ్యాపారి దశాబ్ద కాలం లో ఈ దందా లో గట్టిగా స్థిరపడ్డాడు.దీనితో గోల్డ్ వ్యాపారుల్లో బాగా ఫెమస్ అయ్యాడు.
గోల్డ్ మార్కెట్ లో హెచ్చు తగ్గులతో కొద్దీ రోజుల క్రితం నుంచి ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఆస్తులు మాత్రం బాగానే కూడ బెట్టాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి అప్పులే శరణ్యం అనుకున్నాడు గోల్డ్ వ్యాపారుల నుంచి ఎడాపెడా అప్పులు చేసాడు.
దాదాపు రూ 5 కోట్ల మేరకు అప్పులు చేసాడు కానీ అందుకు తగ్గట్టుగా వడ్డీలు కట్టలేక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఎలా చేసిన చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించలేదు.
చేసేది లేక ఉడాయించాడు. కష్టాల్లో ఉన్నాడు కదా ఇచ్చేస్తాడు లే అనుకోని అతనికి డబ్బు ఇచ్చిన వారంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అలాగే ఆటో నగర్ లోను ఓ వ్యక్తి ఆటోమొబైల్ షాప్ కొత్తగా పెట్టాడు సదురు వ్యక్తి స్థానికుడు కూడా కాదు. కానీ క్రమంగా పరిచయాలు పెంచుకున్నాడు.
నమ్మకస్తుడిగా ముద్ర వేసుకున్నాడు.అదే అదనుగా చేసుకొని ఆటోమొబైల్ హోల్ సెల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నెల నెల ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని నమ్మబలికాడు. ఎవరు ఎంత ఇస్తే అంత లాగేసేడు.
ఓ రోజుల డిసియం లో తెల్లవారు జామునే ఆటో మొబైల్ షాప్ లో విలువైన సామగ్రి ని తీసుకోని జంప్ అయ్యాడు. వారం రోజుల పాటు గాలించిన బాధితులు సుమారు 24 మంది ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.
