నిజామాబాద్: ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) దిలీప్‌ను బెదిరించిన రమేశ్ అనే రిపోర్టర్‌పై కేసు నమోదైనట్లు నాల్గో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
వివరాల ప్రకారం, రెండు రోజుల క్రితం రమేశ్ ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి సీఐ దిలీప్‌ను కలిశాడు. తనకు డబ్బులు ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయబోనని రమేశ్ బలవంతపూర్వకంగా డిమాండ్ చేశాడు. ఆ సమయంలో కార్యాలయంలో హల్చల్ సృష్టించాడు.
సీఐ దిలీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేశ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
