HomeCRIMEఅధిక వడ్డీ ఆశ చూపిస్తూ …..అక్రమంగా డిపాజిట్ లు సేకరిస్తున్న మిడ్ లైఫ్ మీద కేసు...

అధిక వడ్డీ ఆశ చూపిస్తూ …..అక్రమంగా డిపాజిట్ లు సేకరిస్తున్న మిడ్ లైఫ్ మీద కేసు నమోదు …….మూడు కోట్లకు టోకరా ……ఒకరు అరెస్టు


అధిక వడ్డీ ఆశ చూపిస్తూ అమాయక ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్ లు సేకరిస్తున్న మిడ్ లైఫ్ కంపెనీ మీద కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు.

తమిళనాడు లోని తిరుచి రాపల్లి కి చెందిన మిడ్ లైఫ్ కంపెనీ , చైన్ సిస్టమ్ ద్వారా కమిషన్లు ఇస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారనిఅమాయకుల ఆర్థిక బలహీనతలను, ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని, మభ్య పెట్టి మినిమం 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలని, సదరు డిపాజిట్ ల పైన మొదట వారానికి 4% కమిషన్ ఇస్తామని నమ్మబలికారు .ఉదాహరణకు లక్షకు 4,000 రూపాయల చొప్పున 52 వారాలు పూర్తిగా ఇస్తామని చెప్పి చైన్ సిస్టమ్ స్కీమ్ లో మెంబర్లుగా జాయిన్ చేయించి, ఆగస్టు 2024 వరకు ఇచ్చి ఆ తరువాత రూల్స్ ఒప్పు కోవడం లేదని, బుకాయించారు.

పాత మెంబర్ల యొక్క డిపాజిట్ల పైన, ఉండే కొత్త గా వచ్చే డిపాజిట్ ల పైన మినిమం ఒక లక్ష డిపోజిట్ చేయాలని, ఆ డిపాజిట్ ల పైన అక్టోబర్ 2024 నుండి నెలకు 5% చొప్పున కమిషన్, వడ్డీ ఇస్తూ మెంబర్స్ తమ డిపాజిట్ల ను 6 నెలల తరువాత ఎప్పుడైనా విత్ డ్రా చేయాలనుకుంటే డిపాజిట్ చేసిన పూర్తి డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది

నమ్మిస్టూ వచ్చారు చైన్ సిస్టం లాగ డిపాజిట్ దారులు తమ క్రింద 6 గురిని జాయిన్ చేయిస్తే, వారు కూడా తమ క్రింద ఇలా 14 లెవెల్స్ లో ఇంకా కొంత మంది నీ డిపాజిట్ చేయిస్తే , గోల్డ్ సిల్వర్ కాయిన్, బైకులు, గిఫ్ట్ లు ఇస్తామని ఆశ చూపారు. దీనితో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 400 మంది అమాయక ప్రజల నుండి దాదాపు సంవత్సర కాలం నుండి సుమారు మూడు కోట్లకు పైగా వరకు అక్రమంగా డిపాజిట్ చేయించినట్లుపోలీసులవిచారణ లో తేలింది .

ఈ అక్రమ డిపాజిట్లలో, చైన్ సిస్టం స్కీమ్ లో కొంత మంది యాజ మన్యానికి సహకరించి ఈ చట్ట విరుద్ధమైన డిపాజిట్లు, మల్టీ లెవెల్ చైన్ సిస్టం బిజినెస్ లో ఆక్టివ్ గా పాల్గొన్నారు. బాధితుల పిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు పై కంపెనీకి, పేమెంట్స్, అకౌంట్లకు సంబంధించిన సమాచారం సేకరించారు

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాగర్ ను అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు పంపి నట్లు ఏసీపీ చెప్పారు . మేనేజింగ్ డైరెక్టర్ సగయ రాజ్ కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవి చంద్రన్ , ఇంకా బాధ్యులైన ఇతరులపైన విచారణ జరుగుతుందన్నారు

ప్రజలు దయచేసి ఎలాంటి ఆకర్షణీయమైన ఉచితాలకు, అధిక వడ్డీలకు ఆశ పడి తమ కుటుంబం, పిల్లల కోసం కష్టపడి సంపాదించిన డబ్బును అక్రమ సంస్థలలో, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలలో డిపాజిట్ చేయకూడదు, డిపాజిట్ చేసే ముందు సదరు కంపెనీ కి సంబంధించిన డాక్యుమెంట్స్, చట్ట బద్దత లను వెరిఫై చేసుకోవాలని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేయటమైనది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments