HomeTelanganaNizamabad…వెకిలి మాటలు మాట్లాడడం అర్వింద్ కు అలవాటే ….పసుపు బోర్డు కోసం అలుపెరగని పోరాటం చేసా...

…వెకిలి మాటలు మాట్లాడడం అర్వింద్ కు అలవాటే ….పసుపు బోర్డు కోసం అలుపెరగని పోరాటం చేసా ……. ఎమ్మెల్సీ కవిత

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం త్రిముఖ వ్యూహం తోనే తాము అలుపెరగని పోరాటం చేశామని ఇందులో అర్వింద్ ఘనత ఏముందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు ఆమె ఆదివారం బిఆర్ యస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను. లోకసభ లోను గొంతెత్తన్నారు. ప్రధాన మంత్రిని నరేంద్ర మోదీని జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లతో రెండు సార్లు కలిశానన్నారు.


పసుపు బోర్డుకు ప్రయత్నం చేస్తేనే పసుపు ఆధారంగా రావాల్సిన పరిశ్రమల కోసం కృషి చేశామన్నారు .పసుపుకు రూ. 15 వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశాను.అలాగే దిగుమతులు తగ్గించాలని కేంద్రం మీద ఒత్తిడి చేశామన్నారు. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతుంది…

దాంతో రైతులు నష్టపోతున్నారు.
కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదు…. మద్ధతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు.ఇప్పటికైనా
పసుపు దిగుమతులను నియంత్రించాలని డిమాండ్ చేశారు .2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతవుతే… ఇప్పుడు రెట్టింపయ్యిందన్నారు.
ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.కేవలం రాజకీయం కోసం పసుపు బోర్డు కాకపోతే… వెంటనే దిగుమతులపై నియంత్రణ విధించాలనిడిమాండ్ చేసారు. పసుపుకు పాటు రూ 15 వేల మద్ధతు ధర ప్రకటించాలన్నారు.


ఎంపీ అర్వింద్ కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు.
తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరన్నారు

కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారు.ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చి తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందని మాట మార్చాడని ఆమె గుర్తు చేశారు తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్ల ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైంది

అది కూడా ఆయన గొప్పతనమని అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది… పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారు

ఒకవేళ బెంజ్ కారు ఉంటే… అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు ?

ఎందుకు ఇంత వైరాధ్యంతో రకరకాల మాటలు చెబుతున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలన్నారు.

ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుందన్నారు కానీ అది కూడా తన ఘనత అని అర్వింద్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించింది
అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎంపీ అర్వింద్ ను డిమాండ్ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments