నగరంలోని తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. ఈ ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం. షేక్ జునైద్ తల్లిదండ్రులతో కలిసి నగరంలోని శాంతి నగర్ లో నివసిస్తున్నారు. ఈమేరకు శనివారం రాత్రి షేక్ జునైద్ తల్లిదండ్రులతో కలిసి ముజాయిద్ నగర్ లోని సోదరుని ఇంటికి వెళ్ళారు.
దీంతో తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగల గొట్టి ఇంట్లొకి చొరబడి బీరువా నుంచి 4 తులాల బంగారం, రూ 80,000నగదు అపహరించినట్లూ తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
