HomeCRIMEఇందిరమ్మ ఇల్లు పేరుతో ఇసుక దందా..మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన చీత ఫోర్స్

ఇందిరమ్మ ఇల్లు పేరుతో ఇసుక దందా..మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన చీత ఫోర్స్

ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ దందాపై అందిన సమాచారంతో చీత ఫోర్స్
పోలీసులు అప్రమత్తమై, అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మాక్లూర్ మండలంలోని గుప్తా గ్రామంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో చీత ఫోర్స్
వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణాల కోసం అంటూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

సరైన అనుమతులు లేకపోవడంతో సదరు వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
పథకం పేరు చెప్పి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments