పేకాట స్థావరం పై సి.సి.ఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
సి.సి.ఎస్ ఇంచార్జ్ ఏ.సి.పి మస్తాన్ అలీ సూచనల మేరకు గోవింద్ ఎస్సై, సిబ్బంది తో కలిసి నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ నగర్ లో గల ఓక ఇంట్లో పేకాట ఆడుచున్న వారిని పట్టుకొని నగదు రూ 16,740/- , 5 స్మార్ట్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాట రాయుళ్ళును అదుపులోకి తీసుకొని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.
