Saturday, May 2, 2026
HomeCRIMEఘరానా దొంగ ఘాతుకం........... స్టేషన్ కు వెళ్తుండగా వెనుక నుంచి కత్తిపోటు .......కానిస్టేబుల్ దారుణ...

ఘరానా దొంగ ఘాతుకం……….. స్టేషన్ కు వెళ్తుండగా వెనుక నుంచి కత్తిపోటు …….కానిస్టేబుల్ దారుణ హత్య ……… పోలీస్ శాఖ లో విషాదం …..

చాల కాలం తరవాత చిక్కిన ఓ ఘరానా దొంగ ను పట్టుకొని స్టేషన్ కు బైకు మీద తరలిస్తున్న క్రమంలో వెనుక నుంచి ఒక్కసారి గా కత్తితో దాడి చేసిన ఘటన ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పోలీస్ శాఖ లో విషాదం నింపింది.ఉన్నతాధికారులను సైతం ఉలిక్కిపడేలా చేసింది.

నగరంలో వినాయక్ నగర్ లో ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నగరంలోని హస్మి కాలనీ కి చెందిన రియాజ్ అరబ్ అనేక బైక్ దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నాడు.గతంలో అనేక చోరీ కేసులున్నాయి.

రియాజ్ హస్మి కాలనీ లో ఉన్నట్లు సమాచారం రావడంతో సీసీయస్ ఎస్సై బీమ్ రావు. విఠల్ కల్సి వెళ్తూ మరో కానిస్టేబుళ్లు ప్రమోద్ ను ఫోన్ చేసి నేరుగా అక్కడికి రప్పించారు. తన అల్లుడు తో కల్సి బైకు మీద వెళ్లిన ప్రమోద్ లు వెళ్లారు కానీ వీరి రాక తో అప్రమత్తం అయిన రియాజ్ అక్కడే మురికి కాల్వ ను దూకేసి పారిపోయాడు కానీ ప్రమోద్ పరుగెత్తి పట్టుకున్నాడు.

రియాజ్ గతంలోనూ సీసీ ఎస్ పోలీసులు అరెస్టు చేశారు అతని స్వభావం అంచనా ఉండడంతో బైకు మీద తీసుక రావాలని ప్రమోద్ ను పురమాయించారు. కానీ రియాజ్ ను తనిఖీ చేయలెదు. రోడ్డు వెంట రియాజ్ ఎలాంటి ప్రతిఘటన చేయలేదు.

ప్రమోద్ బైకు నడుపుతుండగా మధ్య రియాజ్ ఉన్నాడు వెనుక అల్లుడు వుండడంతో సీసీఎస్ స్టేషన్ కు వస్తున్నాడు ఈ క్రమంలో రియాజ్ బొడ్డు లో నుండి పదునైన కత్తి తీసి మొదట వెనుక ఉన్న అల్లుడు తొడ మీద పొడిచి ఆ తర్వాత రెప్ప పాటు కాలం లోనే ముందున్న ప్రమోద్ మీద విరుచుక పడ్డాడు.

వెనుక నుంచి కత్తి దూసుక రావడం ప్రమోద్ గమనించలేక పోయారు నేరుగా గుండె భాగంలో లోకి వెళ్ళింది. దీనితో అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. వెనుకే మరో బైకు మీద వస్తున్న బీమ్ రావు విఠల్ సైతం అడ్డుకో బోయారు కానీ వారిమీదికి కత్తి తో దాడి చేసి పారిపోయాడు.

వెంటనే అప్రమత్తం అయినా బీమ్ రావు నాలుగో టౌన్ ఎస్సై కి సమాచారం ఇవ్వడంతో సమీపం లోనే ఉన్న వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి రక్తం మడుగులో పడి ఉన్న ప్రమోద్ ను ఆసుపత్రి కి తరలించారు.

కానీ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. మృతుడి కి ముగ్గురు పిల్లలున్నారు మొన్నటి దాక ట్రాఫిక్ విభాగంలో పనిచేసిన ఆయన ఇటీవలే సీసీఎస్ కు బదిలీ అయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!