ఏదైనా విపత్తు తమదాకా వస్తే గాని నొప్పి తెలియదు.మనుషుల్లో మానవత్వ ఛాయలే కనుమరుగు అవుతున్నాయి.
ప్రజల ధన మాన ప్రాణాల కోసం రాత్రిబవళ్ళు పనిచేసే ఓ కానిస్టేబుల్ మీద ఓ యువకుడు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కత్తి తో దాడి చేస్తుంటే ఏ ఒక్కరూ అడుగు ముందుకేయలేక పోయారు.
సరే దైర్యం లేదనుకోవచ్చు కానీ కత్తి పోట్ల కు గురై ఒళ్లంత రక్తం తో నడి రోడ్డు మీద కుప్ప కూలి పోతుంటే ఏ ఒక్కరూ అయ్యో పాపం అంటూ ఆసుపత్రి కి చేర్చడానికి ముందుకు రాలేక పోయారు ఒకరిద్దరు ఆటో వాలా అయితే ఎహే మేము తీసుకెళ్ళాం అంటూ నిరాకరించి వెళ్లి పోయారు.
అసలు ఎవరికి తాము ప్రాణాలకు తెగించి పనిచెయ్యాలనే ఆవేదన కొందరు పోలీసుల్లో వ్యక్తం అయింది.
ఇలా ఒక క్రైంను ఛేదించే విషయంలోనే ఈ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కమిషనర్ సాయి చైతన్య ఆవేదన చెందారు .
కానిస్టేబుల్పై దాడి చేసిన నిందితుడు రియాజ్ సైతం అక్కడి నుంచి పారిపోగా.. ఎవరూ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ సాయంచేసే బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. అలా పరోపకారం చేస్తే తిరిగి ఎప్పుడో అది మనకు పనిచేస్తుందని చెప్పారు.
