ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తోలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో ఎవ్వరికి అనుకూల ఫలితం రాకవపోవడంతో రెండో రౌండ్ వోట్ల లెక్కింపు అనివార్యం అయింది.
బుధవారం అర్థరాత్రి దాక తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది .ఈ ఎన్నికల ఫలితం మరింత ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య హోరా హోరీ సాగుతోంది. అందరూ అనుకున్నట్లుగానే.. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి. అయితే, కోటా నిర్ధారణ ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి(75675 ఓట్లు) మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి(70565 ఓట్లు) ఉన్నారు. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ట(60419 ఓట్లు) ఉన్నారు.. అంజిరెడ్డి తొలి స్థానంలో, నరేందర్ రెడ్డి రెండో స్థానంలో, ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో..
ఎలిమినేషన్ ప్రాసెస్‌లో అభ్యర్థి ఎన్నికను ఖరారు చేయనున్నారు అధికారులు. అంటే.. మూడో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు.
ఎలిమినేషన్ పద్ధతి ప్రకారం రెండో ప్రాధాన్య ఓట్లను బదలాయిస్తూ లెక్కించనున్నారు.బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండి కొట్టారు ఆయన కు ఎక్కువగా కరీంనగర్ జిల్లానుంచే వోట్లు పోలయ్యాయి.
