నగంరంలోని నందేవాడలోనీ శ్రీ విఠలేశ్వర ఆలయంలో శనివారం హనుమాన్ పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇంటలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సతీష్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విశేష పూజా కార్యక్రమంలో నగర సిపి సాయిచైతన్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న కమిషనర్‌కు అర్చకులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి సీపీ సాయిచైతన్య భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించారు.
పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం మారుతి నామస్మరణతో మారుమోగింది. పూజానంతరం సతీష్ కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, హనుమాన్ మాలధారణ చేసిన భక్తులు సీపీని శాలువాతో ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు, ఎస్బీ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్బీ ఎస్ఐ సంతోష్ రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
