HomeTelanganaNizamabadస్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలి..సిపిఎం పిలుపు.

స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలి..సిపిఎం పిలుపు.

స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలనీ సిపిఎం పిలుపు ఇచ్చారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల కు రాజకీయ శిక్షణా తరగతులను పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సందర్భంగా శనివారం జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, మహాసభల నిర్ణయాలను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ వివరించారు.

అంతర్జాతీయంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని యుద్దానికి అనేక దేశాల్లో ప్రయత్నం చేస్తున్నారు.

అదేవిధంగా దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి కి తలొగ్గి ఉగ్రవాదుల ను పట్టుకోకుండా దాడులు ముగించారు. ఉగ్రవాదుల దేశంలో చొరబడ్డారు వారిని అరికట్టేందుకు ప్రభుత్వం సంస్థలు విఫలం చెందారని తెలిపారు.

వీటిపై చర్చలు జరపడం లేదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వామపక్ష పార్టీల ప్రబావం పెరగకుండా ఆలోచిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి సారించి చర్యలు చేపట్ట కుండా నిర్లక్ష్యం చేస్తున్నారని.

అందుకే స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులు దృష్టి పెడితే ప్రజలు కదులు తారన్ అందుకు ప్రజలు కదిలించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు శాస్త్రీయ ఆలోచన పై పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు చెప్పారు.

అంతకు ముందు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాజకీయ కాసుల అవసరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నాయకులు తమ అవగాహన కల్పించేందుకు ఉపయోగం అని అన్నారు.

ఈ రెండు రోజుల క్లాసుల కు జిల్లా నాయకులు వెంకటేష్ అద్యక్ష తన జరుగుతోంది. ఇందులో పార్టీ నాయకులు సుజాత ,సురేష్, వై. గంగాధర్, కే. గంగాధర్,.ఎల్లయ్య, శిల్ప లింగం, కే. బాలయ్య, సాయిలు,భూమయ్య, అంజయ్య, అనిత, ఉద్ధవ్ దినేష్, విశాల్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments