Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadకార్తికేయ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ టెండర్ రద్దుచేయాలని దండి వెంకట్ డిమాండ్

కార్తికేయ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ టెండర్ రద్దుచేయాలని దండి వెంకట్ డిమాండ్

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధుల నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల టెండర్ టైం మార్చి నెల వరకు ఉన్నప్పటికి 8 నెలల ముందే కొత్తగా కార్తికేయ సర్వీసెస్ హైద్రాబాద్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారని కానీ ఆ కాంట్రాక్టర్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ చెల్లించడం నిర్లక్ష్యం చేస్తున్నందుకు


కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ టెండర్ ను రద్దు చేసి ఔట్ సోర్సింగ్ కార్మికుల హెల్ప్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా వేతనాలు చెల్లించాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్- నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు,


బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్- (బిఎల్ టీయూ) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు.
ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కలిసి ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల నెల వేతనాలు వేసే సందర్భంగా కొంత మంది కార్మికులకు బ్యాంక్ లో డబ్బులు వేయడం లేదన్నారు.


కార్మికులు ఫోన్ చేసి అడిగితే రేపు మాపు అంటూ కాలేయాపన చేస్తున్నారని తెలిపారు .
దశరా పండుగ రోజున జోన్ 2 లో పని చేసే మధుకు జీవితం వేయలేదని
పండుగ రోజున కార్మికుని కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా ఇబ్బంది పడ్డదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


కార్మికులు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా స్పందించడంలేదని, యూనియన్ నాయకులు ఫోన్ చేసి కార్మికుల సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల వేతన డబ్బులు బ్యాంక్ లో ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తే వివరాలు సరిగా లేవని బుకాయిస్తున్నారని తెలిపారు.


20 సంవత్సరాల నుండి పని చేస్తున్న కార్మికుల వివరాలు కొత్తగా వచ్చిన కార్తికేయ సర్వీసెస్ కాంట్రాక్టర్ రాగానే మాయమవుతుందా అని ప్రశ్నించారు.

అదేవిధంగా కార్మికుల కుటుంబ సభ్యుల పేరుపై ఔట్ సోర్సింగ్ కార్మికుల మార్పు విషయంలో కార్తికేయ సెక్యూరిటీ సర్విస్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కు లెటర్ కోసం గత రెండు నెలలుగాఫోన్ చేస్తే లెటర్స్ ఇవ్వడం లేదన్నారు.
గతంలో ఉన్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఈవిధంగా ఎప్పుడు వ్యవహారించలేదని,
కావున కార్తికేయ సర్వీసెస్ వెంటనే నోటిసులు జారి చేసి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ న రద్దు చేసి కార్మికుల సెల్ప్ హెల్ప గ్రూప్ ల ద్వారా వేతనాలు చెల్లించాలని
దండి వెంకట్ డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్-BLTU
నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, వాటర్ సప్లై యూనియన్ కార్యదర్శి ఎ.హరిష్, నాయకులు మురళి, శ్రీశైలం, విశ్వనాథ్, ప్రశాంత్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!