నగరంలో 4.2 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ &ఎక్సైజ్ వి.సోమి రెడ్డి సూచనల మేరకు, జిల్లా ప్రోహిబిషన్ &ఎక్సైజ్ అధికారి,.కే.మల్లా రెడ్డి ఆదేశాలకు మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు కంటేశ్వర్ బైపాస్ నుండి మాధవనగర్ వచ్చే మార్గం లో తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తులు రెండు వాహనాలలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ అసద్ బాబా నగర్ కి చెందిన సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి ని అరెస్ట్ చేసి 2.1 కేజీల గంజాయి,పల్సర్ బైక్ ను సీజ్ చేశారు. అతనిని విచారించగా మహారాష్ట్ర లోని నాందేడ్ పట్టణం నుండి తీస్కుని వచ్చి ఇక్కడ అధిక లబానికి అమ్ముతానని తెలిపారు.
మరొక కేసులో అదే మార్గం లో ఆటో లో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం మేరకు తనికి చేయగా నిజామాబాద్, ద్వారకానగర్ కి చెందిన సాజిత్ అలీ అనే వ్యక్తి ఆటో ను వదిలి పరారయ్యాడు. ఆటో లో 2.1 కేజీ ల గంజాయి లభించింది. మొత్తం రెండు కేసులలో (4.2) కేజీలు గంజాయి,1 పల్సర్ బైక్, ఒక ఆటో ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
కేసు లో సర్ఫరజ్ ఖాన్ నీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ తనిఖీలలో నిజామాబాద్ SHO..ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.దిలీప్ ,ఎక్సైజ్ SI మల్లేష్, సిబ్బంది షబ్బీర్, ప్రభాకర్, దారి సింగ్ , రవి, సంగయ్య, సౌమ్య పాల్గొన్నారు.
