HomeCRIMEపాకిస్థాన్ పౌరులను ఈ దేశం నుండి వెళ్లగొట్టండి - అర్బన్ ఎమ్మెల్యే

పాకిస్థాన్ పౌరులను ఈ దేశం నుండి వెళ్లగొట్టండి – అర్బన్ ఎమ్మెల్యే

జమ్మూ & కాశ్మీర్ పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలి అనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేసి నిజామాబాదు జిల్లాలో పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తులను వెళ్లగొట్టాలని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు, అర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్యకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతు నిజామాబాదు జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం,చెల్లుబాటు కానీ వీసాలతో నివసించే వారిని గుర్తించి వారిని బహిష్కరించాలని సీపీకి సూచించారు.

గతంలో నిజామాబాదులో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని సూచించారు.నగర అంతర్గత శాంతి భద్రతలకు విఘతాం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ మిత్రపక్షం పాలిత రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదు అన్నాడు దీని మూలాన ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘతాం కలుగకుండా ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేట్లర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments